తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంజినీరింగ్​ ఫీజులపై స్పష్టత రావాలి' - engineering colleges

రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఇంజినీరింగ్ విద్యార్థుల తల్లిడండ్రుల జేఏసీ అభిప్రాయపడింది. ప్రభుత్వం టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను నియమించి 2019-20, 2021-22 బ్లాక్‌ పీరియడ్‌కి సహేతుకంగా ఫీజులను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.

'ఇంజినీరింగ్​ ఫీజులపై స్పష్టత రావాలి'

By

Published : Jun 27, 2019, 12:00 AM IST


దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయని... దీనికి తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ ఛైర్మన్‌ లేకపోవడం ప్రధాన కారణమని ఇంజినీరింగ్‌ విద్యార్థుల తల్లిదండ్రుల జేఏసీ హైదరాబాద్‌లో అభిప్రాయపడింది. ప్రభుత్వం వెంటనే టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను నియమించి... 2019-20, 2021-22 బ్లాక్‌ పీరియడ్‌కి సహేతుకంగా ఫీజులను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపాదిత ఫీజుల మేరకు ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ సమీపిస్తున్నందున కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయని వారు పేర్కొన్నారు. యాజమాన్యాల అభ్యర్థనను హైకోర్టు అనుమతించినందున పెంచిన ఫీజుల వసూలుకు రంగం సిద్ధమైందని... దీనివల్ల మిగిలిన కాలేజీలు ఫీజులు పెంచుకోవడానికి కోర్టు అనుమతి కోసం క్యూ కడుతున్నాయని వాపోయారు. ఫీజుల నియంత్రణపై స్పష్టత వచ్చే వరకు కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

'ఇంజినీరింగ్​ ఫీజులపై స్పష్టత రావాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details