తెలంగాణ

telangana

ETV Bharat / state

రవి ప్రకాశ్​కు మరోసారి నోటీసులు - NOTICE_TO_RAVIPRAKASH

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​కు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు పోలీస్​ స్టేషన్​లో హాజరు కావాలని తాఖీదుల్లో పేర్కొన్నారు

రవి ప్రకాశ్​కు మరోసారి నోటీసులు

By

Published : May 14, 2019, 4:55 AM IST

Updated : May 14, 2019, 1:54 PM IST

రవి ప్రకాశ్​కు మరోసారి నోటీసులు

సీఆర్పీసీ 41ఏ కింద టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​కు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడో విడత నోటీసులు జారీ చేశారు. ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. బంజారాహిల్స్​లోని రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆయన ఇంట్లో లేనందున గోడకు నోటీసులు అంటించారు. ఏబీసీఎల్ కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్, మూర్తితో పాటు మహేష్​పై కేసు నమోదు చేశారు.

హాజరు కాకపోతే...
రవిప్రకాశ్​ డైరెక్టర్ల నియామకంలో అడ్డుపడుతున్నారని, ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. నటుడు శివాజీతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించారనే ఫిర్యాదులోనూ రవిప్రకాశ్, శివాజీపై కేసు నమోదైంది. గత ఐదు రోజులుగా రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు ఇంటితో పాటు పలు చోట్ల వెతుకుతున్నారు. ఈనెల 15వ తేదీ విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: తెలంగాణ సీజేగా జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నియామకం..!

Last Updated : May 14, 2019, 1:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details