తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో మంత్రులకు లోక్​సభ పరీక్ష...! - 2019 elections

పార్లమెంటు ఎన్నికల బాధ్యత అమాత్యులకు అప్పగించారు గులాబీ దళపతి. ఎమ్మెల్యేలు, నేతలను సమన్వయం చేసుకుంటూ... పల్లెల్లో ప్రచారానికి పురమాయించారు. ఫలితాల ప్రభావం మంత్రివర్గ విస్తరణపై ఉంటుందని భావిస్తున్న మంత్రులు... ఘనవిజయం సాధించి అధినేతకు కానుకగా ఇస్తామంటూ...పోటాపోటీగా పనిచేస్తున్నారు.

పార్లమెంటు ఎన్నికల ప్రచార భాధ్యతలోల మంత్రులు

By

Published : Apr 1, 2019, 10:11 AM IST

Updated : Apr 1, 2019, 11:19 AM IST

పార్లమెంటు ఎన్నికల ప్రచార భాధ్యతల్లో మంత్రులు
నియోజకవర్గాల్లోనే ఉండి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్న అధినేత ఆదేశాలతో... మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారు. కీలక సమయంలో మంత్రులుగా ఉన్నందున... నాయకత్వాన్ని నిరూపించేందుకు రంగంలోకి దిగి ఇరవై రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసుకుంటూ వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్కో మంత్రికి ఓ పార్లమెంటు స్థానాన్ని గెలిపించే బాధ్యత అప్పగించారు.

అన్నీ తామై...

సికింద్రాబాద్ లోక్​సభ తలసాని శ్రీనివాస్ యాదవ్ భుజాన వేసుకున్నారు. ఇక్కడి నుంచి బరిలో ఉన్న ఆయన తనయుడు సాయికిరణ్ యాదవ్ గెలుపు కోసం విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. మల్కాజిగిరిలో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నందున... ఆయనే అభ్యర్థిలా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్​లో వినోద్ కుమార్​ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ఈటల రాజేందర్​కు అప్పగించారు.

పెద్దపల్లి పార్లమెంటు బాధ్యత... వివేక్​ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వెంకటేశ్ నేతకాని పేరును ప్రతిపాదించిన కొప్పుల ఈశ్వర్​పైనే ఉంచారు. ఆదిలాబాద్​ బాధ్యత ఇంద్రకరణ్ రెడ్డి స్వీకరించారు. అభ్యర్థిగా నగేష్​ను ప్రకటించినప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజా పరిణామాలతో కీలకంగా మారిన మహాబూబ్​నగర్​లో అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని శ్రీనివాస్ గౌడ్​ను ఆదేశించారు. నాగర్​కర్నూలులో రాములు విజయానికి నిరంజన్ రెడ్డి కృషి చేస్తున్నారు.

నిజామాబాద్​లో కవిత, జహీరాబాద్ బీబీ పాటిల్ గెలుపు కోసం వేముల ప్రశాంత్​రెడ్డి శ్రమిస్తున్నారు. వరంగల్​తోపాటు మహబూబాబాద్​ను సమన్వయం చేసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్​ రావుకు సూచించారు. నల్గొండ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్​ను గెలిపించే బాధ్యతలు జగదీశ్ రెడ్డికి ఇచ్చారు.

అధినేత పర్యవేక్షణలో...

మెదక్​లో హరీష్​ రావు, ఖమ్మం పల్లా రాజేశ్వర్​ రెడ్డికి, చేవెళ్లలో కర్నె ప్రభాకర్ రెడ్డికి సమన్యయ బాధ్యతలు అప్పగించి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీలను ఆకర్షించడం, హైదరాబాద్​లో పరిస్థితులు మహమూద్ అలీ పర్యవేక్షిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీల ఉద్వాసన పలికినందున మంత్రులు ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్లమెంటు ఫలితాలు మంత్రివర్గ విస్తరణకు పరిగణలోకి తీసుకుంటారన్న ప్రచారంతో మంత్రులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ఇవీ చూడండి:నేడు హైదరాబాద్​లో భాజపా సభకు హాజరుకానున్న మోదీ

Last Updated : Apr 1, 2019, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details