లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస ఎన్నికల సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 1 నుంచి 11 వరకు పార్లమెంటు నియోజకవర్గాల్లో తెరాస సన్నాహాక సమావేశాలు నిర్వహించనుంది. "16 స్థానాలు సాధిద్దాం.. దిల్లీని శాసిద్దాం" అనే నినాదంతో ముందుకు సాగనున్నట్లు అందులో పేర్కొంది.
ప్రతీ సమావేశంలో కేటీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశాలన్నింటిలో తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తారని ఆయన అన్నారు.
భాజపా, కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు: పల్లా
అభివృద్ధికి ఒకప్పుడు గుజరాత్, కేరళ మోడల్‌గా ఉండేవని.. ఇప్పుడు తెలంగాణ మోడల్‌గా ఉందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో భాజపా, కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోనున్నాయని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏలకు పూర్తి మెజారిటీ రాదని.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అంచనా వేశారు.
ఇవీ చదవండి:ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాటికొండ