తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ కవితకు కేరళ ఆహ్వానం - kerala govt

యువతలో రాజకీయ విలువలపై అవగాహన కల్పించడానికి కేరళ ప్రభుత్వం ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్​ ఎంపీ కవితను కేరళ ప్రభుత్వం ఆహ్వానించింది.

కల్వకుంట్ల కవిత

By

Published : Feb 5, 2019, 2:21 AM IST

తెలంగాణ ఆడపడుచుకు కేరళ ఆహ్వానం
యువతలో రాజకీయ, ప్రజాస్వామిక విలువల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రసంగించేందుకు నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆహ్వానిస్తూ కేరళ శాసనసభాపతి శ్రీరామకృష్ణన్​ లేఖ రాశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. 23న మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు క్యాస్ట్​ అండ్​ ఇట్స్​ డిస్​కంటెన్ట్స్ అనే అంశంపై కవిత ప్రసంగిస్తారు. దేశ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి దాదాపు రెండు వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details