దేశంపైనే దాడి జరిగింది - budget session
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా పుల్వామా ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన అమరవీరులకు సభ్యులు నివాళులు అర్పించారు.
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని శాసనసభ ఖండించింది. సభ ప్రారంభం కాగానే.. నిరాయుధులైన జవాన్లపై దాడి అమానుషం, హేయమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంతాపం తెలిపారు. ఇది మన దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
రూ.25లక్షల ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ తీర్మానానికి తామూ ఆమోదం తెలుపుతున్నామని కాంగ్రెస్, మజ్లిస్, భాజపా సభ్యులు తెలిపారు. అనంతరం రెండునిమిషాలు మౌనం పాటించారు.