సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మె వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో చర్చలనంతరం విరమించారు. తమ డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించినట్లు జూడాలు తెలిపారు. వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్ జారీ చేసినందున నిబంధనలు రూపొందించే సమయంలో తమ అభిప్రాయాలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రొఫెసర్ల కొరతతో బోధన కుంటుపడిందన్నారు. శ్వాశ్వత నియామకాలతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. నల్గొండ, సూర్యాపేట వైద్య కళాశాలల్లో ఒప్పంద ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
చర్చలు సఫలం... సమ్మె విరమించిన జూడాలు - strike-calloff
జూనియర్ వైద్యులు మూడురోజులుగా చేస్తున్న సమ్మె ఇవాళ విరమించారు. తమ డిమాండ్లపై మంత్రి ఈటల రాజేందర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. శాశ్వత నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
చర్చలు సఫలం... సమ్మె విరమించిన జూడాలు