తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇట్స్​ టైమ్​ ఫర్​ కేరళ

ప్రకృతికి పుట్టినిల్లు.. సంస్కృతి, సంప్రదాయాల హరివిల్లు...ఇవన్నీ చూడాలంటే 'కేరళకు రండి' అంటూ ఆహ్వానిస్తున్నారు మళయాళీలు.

'కేరళకు రండి' అంటున్న మళయాళీలు

By

Published : Feb 14, 2019, 8:18 PM IST

'కేరళకు రండి' అంటున్న మళయాళీలు
దేవ భూమి పిలుస్తోంది. ప్రకృతిని ఆస్వాదించేందుకు రా రమ్మంటోంది. విహారయాత్రను మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేలా ప్యాకేజీలతో కేరళ పర్యాటక శాఖ ముందుకొచ్చింది . టూరిస్ట్ స్పాట్‌లు, ప్యాకేజీల వివరాలతో హైదరాబాద్​లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది.

కేరళ అనగానే గుర్తుకొచ్చే కాఫీ తోటలు, పడవలో ప్రయాణం, కేరళ సంప్రదాయ నృత్యాలు, కలరియపట్టు విన్యాసాలు ఈ అవగాహన సదస్సులో కళ్లకు కట్టాయి.

మొన్నటి వరదల నుంచి కోలుకుని పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. టూరిస్ట్ ప్లానర్స్, రిసార్ట్స్, హోటల్స్ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రకృతి ప్రకోపించినా..పర్యాటకుల ఆదరణకు ఏమాత్రం కొదవలేదని..కేరళ పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ తెలిపారు. కేరళ పునరుద్ధరణలో తెలంగాణ అందించిన సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గతేడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణ పర్యాటకుల సంఖ్య అత్యధికంగా 27.5 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేరళ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details