పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరుల కోసం నగరంలో ప్రత్యేక వస్త్రాభరణాల ప్రదర్శన ఏర్పాటైంది. ఆల్ హాది ఇస్లామిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో ఆల్ హాది ఎక్స్పోను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి కొత్త ఉత్పత్తుల విశేషాలు అడిగి తెలుసుకున్నారు. రంజాన్ ప్రత్యేక ప్రదర్శనలో దాదాపు వందకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు రెహ్మాన్ తెలిపారు.
రంజాన్ ప్రత్యేకం... ఆల్ హాది ఎక్స్పో - al hadi expo
రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక వస్త్రాభరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ దీనిని ప్రారంభించారు.
రంజాన్ ప్రత్యేకం... ఆల్ హాది ఎక్స్పో