సచివాలయం నిర్మాణం, ప్రస్తుత భవనాల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత భవనాలు కూల్చవద్దంటూ... ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. నిర్మాణ పనులు ఆపాలంటూ చేసిన వినతిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, దురుద్ధేశపూరితంగా వ్యవహరిస్తే మాత్రం జోక్యం చేసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.
సచివాలయం కూల్చివేతపై వివరణ కోరిన హైకోర్టు
సచివాలయం కూల్చివేత వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త భవనాల నిర్మాణ పనులపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.
సచివాలయం కూల్చివేతపై వివరణ కోరిన హైకోర్టు