యాదవులకు 2,600 కోట్లు
ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో యాదవులకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. 3.58 లక్షల మందికి 70 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నారు.
యాదవులకు ప్రత్యేకంగా
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కులవృత్తుల వారికి ప్రాధాన్యతనిచ్చారు. గొల్ల కురుమలలో కుటుంబానికి 75 శాతం రాయితీపై 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించనున్నారు. 3.58 లక్షల మందికి 70 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నారు. 2 వేల 600 కోట్ల సంపద గొల్ల కురుమలకు సమకూరిందని కేసీఆర్ తెలిపారు. గంగపుత్ర, ముదిరాజ్ కులాల వారికి 128 కోట్ల చేప పిల్లలు, 4.27 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందని సీఎం పేర్కొన్నారు.
Last Updated : Feb 22, 2019, 5:07 PM IST