తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాభవన్ ముందు అతిథి అధ్యాపకులు మహాధర్నా - guest lecturers

తెలంగాణ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని హైదరాబాద్ విద్యాభవన్ ముందు మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం న్యాయం చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విద్యాభవన్ ముందు అతిథి అధ్యాపకులు మహాధర్నా

By

Published : Jul 4, 2019, 6:18 PM IST

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ నాంపల్లిలోని విద్యాభవన్ ముందు మహాధర్నా నిర్వహించారు. రాష్టవ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పదేళ్లుగా 1,354 మంది పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. పీజీ మెరిట్ ద్వారా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్​ విడుదల చేసిందని... ఆ నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యాభవన్ ముందు అతిథి అధ్యాపకులు మహాధర్నా

ABOUT THE AUTHOR

...view details