మూడు కిరీటాలు గోవిందా.. - tirupathi
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తుల కిరీటాలు మాయం.
govindaraj swami temple
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమయ్యాయి. ఉత్సవమూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఆలయంలో విచారణ చేపట్టారు.ఆలయ అధికారులను, సిబ్బందిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్టీంను రంగంలోకి దించారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.