గోల్కొండ కోట కొత్త శోభను సంతరించుకుంది. ఆషాద మాసంలో వైభవంగా జరిగే బోనాల సందడికి అంతా సిద్ధమయ్యారు. కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించటంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించటానికి బోనాలు సిద్ధం చేసుకున్నారు. ముందుగా తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 5 బోనాలు సమర్పించారు. మరికాసేపట్లో సుమారు నూట పదహారు బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నట్లు కుమ్మరి సంఘం సభ్యులు తెలిపారు.
గోల్కొండ కోటలో బోనాల సందడి - bonalu
బోనమెత్తేందుకు భాగ్యనగరం ముస్తాబైంది. గోల్కొండలో శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి కాసేపట్లో బోనాలు సమర్పించనున్నారు. ముందుగా తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 5 బోనాలు సమర్పించారు.
గోల్కొండ కోటలో బోనాల సందడి