తెలంగాణ

telangana

ETV Bharat / state

శంషాబాద్​లో రూ.రెండున్నర కోట్ల బంగారం పట్టివేత - shamshabad

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే 6.5 కిలోల బంగారం పట్టుబడింది. టాస్క్​ఫోర్స్​ పోలీసులు పక్కా సమాచారంతో డీఆర్​ఐ అధికారులతో కలిసి దాడులు చేశారు. పాతబస్తీకి చెందిన 14 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

By

Published : Jul 3, 2019, 2:08 PM IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్న వారి వద్ద 6.5కిలోల బంగారం దొరికింది. పక్కా సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులతో కలిసి దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు... పాతబస్తీకి చెందిన 14మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈ దాడి జరిగింది. పట్టుబడ్డ బంగారం విలువ రెండున్నర కోట్ల రూపాయలు. ఈ కేసులో 14మంది ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

హజ్ యాత్ర పేరుతో తీసుకెళ్లి..

గతంలోనూ ఈ తరహాలో బంగారం తీసుకొచ్చారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. తక్కువ డబ్బులకు హజ్ యాత్రకు తీసుకెళ్తామని కొంతమంది ఏజెంట్లు..... యాత్రికులను హజ్ పంపించి... తిరుగు ప్రయాణంలో వారితో బంగారు ఆభరణాలు తీసుకొచ్చే విధంగా ఒత్తిడి చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ కేసులోనూ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ఇవీ చూడండి: జరభద్రం: బాలుడికి ప్రమాదం... పెద్దలకు పాఠం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details