తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇవాళ అర్ధరాత్రి వరకు ఆస్తిపన్ను చెల్లించవచ్చు' - ghmc tax@danakishore

ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్ను చెల్లించేందుకు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని సిటిజన్​ సర్వీస్​ కేంద్రాలు ఈ రోజు రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ తెలిపారు.

నేటితో ముగియనున్న ఆస్తపన్ను గడువు

By

Published : Mar 31, 2019, 5:31 AM IST

Updated : Mar 31, 2019, 7:21 AM IST

నేటితో ముగియనున్న ఆస్తిపన్ను గడువు
ప్రస్తుత సంవత్సర, అర్ధసంవత్సర ఆస్తిపన్ను చెల్లించడానికి నేటితో గడువు ముగియనుంది. పన్ను చెల్లించడానికి ఇవాళ రాత్రి 12 గంటల వరకు సిటిజన్​ సర్వీస్​ సెంటర్లు పనిచేస్తాయని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్ను చెల్లించాలని నగరవాసులకు సూచించారు. ఇప్పటివరకు ఆస్తిపన్ను కట్టని 4,11,578 మందికి.. చరవాణిలద్వారా సందేశాలు పంపించామన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్ను లక్ష్యం రూ.1500 కోట్లు కాగా శనివారం సాయంత్రం వరకు రూ.1240.35 కోట్లు వసూలయ్యాయని దానకిషోర్​ తెలిపారు.
Last Updated : Mar 31, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details