దిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల లోక్సభ, రాజ్యసభ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలతో పాటు జస్టిస్ నారాయణ, కేంద్ర సమాచారశాఖ కార్యదర్శి మాడభూషి శ్రీధర్ పాల్గొన్నారు. ఎంపీలను శాలువా కప్పి దిల్లీ తెలుగు అకాడమీ ఛైర్మన్ మోహన్ కందా, ప్రధాన కార్యదర్శి నాగరాజు సత్కరించారు. తెలుగు ఎంపీలందరం పార్లమెంట్లో కలిసి...ఇరురాష్ట్రాల అభివృద్ధి కోసం సమష్టిగా ముందుకు వెళ్తామని ఎంపీ నామనాగేశ్వర రావు వెల్లడించారు. సహచర మిత్రులతో కలిసి సభలో సమస్యలపై చర్చిస్తున్నామని ఆయన చెప్పారు.
విభజన హామీలను సాధించుకుంటాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని సాధించుకోవలసిన బాధ్యత తమపై ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. వాటి కోసం కలిసి కట్టుగా పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.