తెలంగాణ

telangana

ETV Bharat / state

కోర్టుల్లో మౌలికవసతులపై సీఎస్ సమీక్ష - court

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి సమీక్ష నిర్వహించారు.

ఉన్నతాధికారులతో సీఎస్​ సమీక్ష

By

Published : Feb 6, 2019, 5:15 AM IST

ఉన్నతాధికారులతో సీఎస్​ సమీక్ష
రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి తెలిపారు. కోర్టుల్లో సౌకర్యాల కల్పనపై సచివాలయంలో సీఎస్​ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న కోర్టు కాంప్లెక్స్​ పనులను వేగవంతం చేయాలని సూచించారు. మరికొన్ని కాంప్లెక్స్​ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాల్లో జ్యుడిషియల్​ అధికారుల నివాస భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం భర్తీ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details