తెలంగాణ శాసనసభ్యుల కోటాలో ఇవాళ జరిగిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్ పోటీలో లేనందున తెరాస(4), మజ్లిస్(1) సభ్యుల ఎన్నిక ఖాయం కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ ఎన్నికల్లో 91 మంది గులాబీ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హస్తం పార్టీ ఎన్నికలను బహిష్కరించగా, తెదేపా, భాజపా దూరంగా ఉన్నాయి. ఎన్నికలను కేంద్రం ఎన్నికల సంఘం అధికారి ఐఏఎస్ శశాంక్ గోయల్ పరిశీలించారు.
వీరే అభ్యర్థులు..
మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేషం అభ్యర్థులను కేసీఆర్ బరిలోకి దింపారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ హసన్, కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పోటీలో ఉన్నపటికీ పార్టీయే ఎన్నికలను బహిష్కరించింది. దీంతో తెరాస, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనమే కానుంది.
ఓట్ల లెక్కింపు షురూ అయింది - mlc elections
తెలంగాణ శాసనసభ్యుల కోటాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెరాస బరిలోకి దింపిన నలుగురు అభ్యర్థులు, మజ్లిస్ నుంచి ఒక అభ్యర్థి గెలుపు లాంఛనం కానుంది.
ఓట్ల లెక్కింపు షురూ
ఇవీ చూడండి:ముగిసిన మండలి ఎన్నికలు