సినీ నటుడు మోహన్‌బాబు వైకాపా గూటికి చేరారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో... పార్టీ అధినేత జగన్ కండువా వేసి స్వాగతించారు. పదవులు కోరుకోకుండానే వైకాపాలో చేరానన్నారు. బంధువు కాబట్టే తాను జగన్ పార్టీలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రానికి మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైకాపాలో చేరేందుకు తనకు ఎవరి అనుమతీ అక్కర్లేదని చెప్పారు.చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నా..ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై మూడు, నాలుగేళ్లుగా మాట్లాడినా... సమస్య పరిష్కారం కాలేదన్నారు.
చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది.. కానీ..! - వైకాపా గూటికి మోహన్‌బాబు
సినీ నటుడు మోహన్‌బాబు వైకాపా గూటికి చేరారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో... పార్టీ అధినేత జగన్ కండువా వేసి స్వాగతించారు.
వైకాపా గూటికి మోహన్‌బాబు