సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు దేశవ్యాప్తంగా జరగనుంది. సుమారు పది లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో పరీక్షకు యూపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్ నుంచి 49 వేల 33 మంది... వరంగల్లో 4 వేల 962 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రలో దాదాపు 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.ఉదయం 9.30 గంటలకు.. మధ్యాహ్నం రెండున్నరకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర సర్వీసుల్లో సుమారు 896 ఖాళీల భర్తీ కోసం పరీక్ష నిర్వహిస్తున్నారు.
నేడే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష - నేడే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష
నేడు దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
నేడే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష