హైదరాబాద్ పంజాగుట్టలో శనివారం దాడికి గురైన వ్యాపారి రామ్‌ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు. విచారణకు పంజాగుట్ట ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే..
పంజాగుట్టలోని వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో శనివారం దైవ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన రామ్‌ప్రసాద్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం... చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని స్థానికులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. క్షతగాత్రుడు గచ్చిబౌలిలో స్టీల్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామ్‌ప్రసాద్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార లావాదేవీలే దాడికి దారి తీశాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
హత్య రూ. 50 కోట్ల కోసమేనా..!