తెలుగు రాష్ట్రాల్లో జరుగనున్న ఓట్ల పండుగకు ఓటర్లు వారి స్వగ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులకు ప్రస్తుత ధరల కంటే ఒకటిన్నర శాతం, ప్రైవేట్ ట్రావెల్స్ రెండు నుంచి మూడు రెట్ల ధరలు వసూలు చేస్తున్నాయి. ఇంత ధరలు పెంచినా టికెట్లు మాత్రం దొరకడం లేదంటున్న ప్రయాణికుల బాధలు వారి మాటల్లోనే...
ఎన్నికల వేళ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు - elections
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకి ప్రయాణమైతున్నారు ఓటర్లు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో ఇసుకవేస్తే రాలనంత జనం. ఇదే అదనుగా ట్రావెల్స్ యజమానులు టికెట్ల ధరను అమాంతం పెంచేశారు. అలా పెంచినా టికెట్లు దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు.
ఎన్నికల వేళ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు