నిమ్స్ ఆస్పత్రిలో వైద్యుడిపై దాడి చేసిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. వైద్యుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమ్స్‌కు చేరుకున్న పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రోగికి వైద్యం అందుతున్నా.... అవేమీ పట్టించుకోకుండా వైద్యుడిపై దాడికి దిగారని డీసీపీ దృష్టికి తీసుకొచ్చారు. తాగిన మత్తులో వైద్యుడిని బూతులు తిట్టారని పోలీసులకు తెలిపారు. నిఖిల్ అనే వ్యక్తిని ఈ రోజు తెల్లవారుజామున నిమ్స్‌లోని అత్యవసర చికిత్స విభాగానికి తీసుకొచ్చారు. రోగికి సరైన వైద్యం అందించడం లేదంటూ కొంతమంది అత్యవసర చికిత్స విభాగం వద్ద హంగామా సృష్టించారు. దీంతో వైద్యులు, మిగతా రోగులు భయాందోళనకు గురయ్యారు. మంత్రి అనుచరులమంటూ హంగామా సృష్టించినట్లు అక్కడే ఉన్నవాళ్లు తెలిపారు. రోగి పరిస్థితి గురించి కనీస సమాచారం అందించకపోవడం ఆందోళనకు గురై... వైద్యుడిని నిలదీసినట్లు రోగి బంధువులు తెలిపారు. అకారణంగా దాడి చేసినట్లు నిమ్స్ వైద్యుడు అన్వేష్ తెలిపారు.
వైద్యుడిపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు - doctor
నిమ్స్‌లో వైద్యులు సరిగా వైద్యం అందించట్లేదంటూ దాడికి దిగిన ఘటనలో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో బూతులు తిట్టినట్లు వైద్యుడు అన్వేష్ తెలిపారు.
వైద్యుడిపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు