పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయం అని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ 98వ జయంతి వేడుకలను బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు గొప్పవని అల్లం నారాయణ కొనియాడారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా అల్లం నారాయణ, పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు హాజరయ్యారు.
'దేశ ఆర్థిక సంస్కరణలకు మూలకర్త పీవీ'
మారుమూల ప్రాంతం నుండి వచ్చి ప్రధాని వరకు ఎదిగిన మహనీయుడు బహుభాషాకోవిదుడు పీవీ నరసింహారావు అని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు. దివంగత ప్రధాని పీవీ జయంతి సందర్భంగా బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆయన మూలకర్త అని... దేశవ్యాప్తంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు దిగ్విజయంగా నిర్వహించి తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి పీవీ అని అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన భూమిపుత్రుడని... రాష్ట్రం ఎల్లవేళలా పీవీని గుర్తు చేసుకుంటూ ఉంటుందని తెలిపారు. లౌకిక విలువలకు కట్టుబడి ఉన్న ఒక సంస్థగా రామానంద తీర్థ మెమోరియల్‌ను తీర్చిదిద్దుతున్న ఆయన కుమారుడిని అల్లం నారాయణ అభినందించారు.
ఇవీ చూడండి:'ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం'