గిరిజన, ఆదివాసీ రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలు జారీ చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత గిరిజన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అటవీ హక్కుల చట్టం-2006లో పేర్కొన్న 13 రకాల హక్కులు అమలు చేయటం ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోడు రైతులు తరలివచ్చారు.
'అటవీ హక్కుల చట్టంతోనే పోడు రైతులకు న్యాయం' - tribal rights
అటవీ హక్కుల చట్టం అమలు చేస్తేనే గిరిజన, ఆదివాసీ రైతులకు న్యాయం జరుగుతుందని అఖిల భారత రైతు కూలి సంఘం అభిప్రాయపడింది. పోడు భూముల రక్షణ కోసం గిరిజనులు, సంప్రదాయక అటవీవాసులంతా ఐక్యంగా ఉద్యమించాలని సంఘం అధ్యక్షుడు వెంకటరామయ్య అన్నారు.
రాష్ట్రంలో పోడు రైతులు, ఆదివాసీలపై అటవీ శాఖ, పోలీసుల వేధింపులపై సదస్సులో చర్చించారు. పోడు భూముల రక్షణ కోసం గిరిజనలు, సంప్రదాయక అటవీ ప్రాంతవాసులంతా ఐక్యంగా ఉద్యమించాలని వెంకటరామయ్య సూచించారు. అటవీ ప్రాంతాల్లో ప్రతి గిరిజన, ఆదివాసీ రైతు నాలుగు హెక్టార్ల విస్తీర్ణం వరకు పోడు భూమి పట్టా తీసుకోవచ్చని న్యాయ నిపుణులు పల్లా త్రినాథ్ రావు అన్నారు. పోడు భూములపై అటవీ శాఖకు హక్కు లేదని, కలెక్టర్‌కు మాత్రమే పట్టా జారీ చేసే అధికారం ఉంటుందని వివరించారు.
ఇదీ చూడండి: విద్యాభవన్ ముందు అతిథి అధ్యాపకులు మహాధర్నా