రెండో విడత స్థానిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత నోటిఫికేషన్ విడుదల చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మినహా మిగిలిన 31 జిల్లాల్లో రెండో దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. 108 జడ్పీటీసీ స్థానాలు, 1,913 ఎంపీటీసీ స్థానాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 26, 27, 28 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి 29న పరిశీలించనున్నారు. 30వ తేదిన అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం ఉంది. వచ్చే నెల 10న పోలింగ్ జరగనుంది.
ముఖ్యమైన తేదీలు
నామినేషన్లు స్వీకరణ - ఏప్రిల్ 26, 27, 28
నామినేషన్ల పరిశీలన -ఏప్రిల్ 29