తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇళ్లు దెబ్బతింటున్నాయి... ఆరోగ్యం పాడవుతోంది... హామీ ఏమైంది?' - తెలంగాణ వార్తలు

సింగరేణి ఉపరితల బొగ్గు గనుల బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా ఇళ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యంతో ఆరోగ్యం పాడవుతోందని వాపోయారు. సింగరేణి అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు బైపాస్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

yellandu local people protest against singareni open coal blasting in bhadradri kothagudem district
'ఇళ్లు దెబ్బతింటున్నాయి... ఆరోగ్యం పాడవుతోంది... హామీ ఏమైంది?'

By

Published : Mar 2, 2021, 1:22 PM IST

సింగరేణి ఉపరితల బొగ్గు గనుల బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా ఇళ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోయారు. దట్టమైన పొగలు, రాళ్లు పడుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బైపాస్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. పేలుళ్ల తీవ్రత తగ్గిస్తామని హామీ ఇచ్చిన అధికారులు... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా పేలుళ్ల తీవ్రతతో ఇళ్లు బీటలు వారుతున్నాయని... కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు.

పట్టణంలోని పలు వార్డుల్లో ఉపరితల గని బ్లాస్టింగ్ సమయంలో పెద్ద పెద్ద రాళ్లు పడుతున్నాయని చెప్పారు. వాహనాలపై రాళ్లు పడినప్పుడు అధికారులు స్పందించి... వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తామని అన్నారని గుర్తు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సింగరేణి అధికారులు స్థానికులతో మాట్లాడారు. సింగరేణి జనరల్ మేనేజర్ హామీ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఆర్థిక క్రమశిక్షణ అలవడాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details