తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామీణ క్రీడాకారులకు మైఫోర్స్​ సంస్థ వాలీబాల్​ కిట్ల పంపిణీ

గ్రామీణ ప్రాంతంలోని యువత వాలీబాల్​ క్రీడలో మరింత రాణించాలనే ఉద్దేశంతో మై ఫోర్స్​ సంస్థ వారికి చేయూతనిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని పలు గ్రామాల్లోని క్రీడాకారులకు వాలీబాల్​ కిట్లను పంపిణీ చేసింది.

wally ball kits distribution by my force charity at yellandu in bhadradri kothagudem
గ్రామీణ క్రీడాకారులకు మైఫోర్స్​ సంస్థ వాలీబాల్​ కిట్ల పంపిణీ

By

Published : Oct 25, 2020, 7:12 PM IST

గ్రామీణ యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో మై ఫోర్స్​ సంస్థ చేయూతనిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని బోటి గుంపు, చేపల వారి గుంపు, మామిడి గుండాల, వేపల గడ్డ, కొమ్ముగూడెం గ్రామాలకు చెందిన వాలీబాల్​ క్రీడాకారులకు కిట్లను అందజేసింది.

వాలీబాల్ క్రీడలో రాణించాలనే ఈకిట్లను అందజేస్తున్నామని... అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సీఐ బరపటి రమేష్ అన్నారు. ఈకార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, గ్రామ పెద్దలు, తదితరలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఉద్యోగం పోయిందని నిరాశ చెందకుండా స్వీయ ఉపాధి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details