భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలి ధాటికి మండలంలోని మామిడిగుండాల గ్రామంలో రాంబాబు, కోటయ్య ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కల్తీ సమ్మయ్య ఇంటి గోడ కూలింది. కొబ్బరి చెట్టు వరిగి రాధాకృష్ణ ఇంటిపై పడటం వల్ల ఇల్లు ముందు భాగం కూలిపోయింది.
అకాల వర్షంతో తీవ్ర నష్టం - అకాల వర్షంతో తీవ్ర నష్టం
ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతోన్న అన్నదాతను అకాల వర్షం ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇల్లందు మండలంలో వర్షం దాటికి.. కొన్నిచోట్ల ఇళ్లపై కప్పులు లేచిపోగా మరికొన్ని చోట్ల మొక్కజొన్న పంట తడిసిపోయింది.
అకాల వర్షంతో తీవ్ర నష్టం
మర్రిగూడెం గ్రామంలో మొక్కజొన్న పంట తడిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు ఒరగడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర అందోళన చెందుతున్నారు.