భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రేగులగండి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సింగరేణిలో ఒప్పంద పద్ధతిన పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. శుక్రవారం రోజున వీరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గ్రామం కట్టుబాటు ప్రకారం.. కరోనా సోకిన వారికి ప్రవేశం లేదు. సింగరేణి క్వారంటైన్లో వీరికి అనుమతి లేదు.
Corona Victims : అడవిలో తలదాచుకున్న కరోనా బాధితులు
కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని మసకబారిస్తోంది. ప్రజల కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మహమ్మారి బారిన పడితే.. కనీసం గ్రామంలోని రానివ్వకుండా కొందరు క్రూరంగా వ్యవహరించారు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం గాక అడవిలోకి వెళ్లిన ఆ కార్మికులను.. కార్మిక సంఘాల నేతలు క్వారంటైన్‌కు తరలించారు.
కొత్తగూడెం జిల్లా వార్తలు, అడవిలో కరోనా బాధితులు
సమీపంలోని సింగరేణి నివాస గృహంలో తలదాచుకున్న వీరని చుట్టుపక్కల వాళ్లు అక్కణ్నుంచి వెళ్లగొట్టారు. దిక్కుతోచని స్థితిలో ఆ కార్మికులు దగ్గరలోని అడవిలోకి వెళ్లారు. రాత్రంతా తిండీతిప్పలు లేకుండా అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు వారిని సింగరేణి క్వారంటైన్‌కు తరలించారు.
- ఇదీ చదవండి:వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష