తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుపరం చేసేందుకే..' - rtc strike

12 రోజులుగా సమ్మె చేస్తున్న కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికులు నిరసనలో భాగంగా భిక్షాటన చేశారు. సీఎం కేసీఆర్​ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకే కఠిన వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.

'ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుపరం చేసేందుకే..'

By

Published : Oct 16, 2019, 6:15 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. పలు పార్టీల నాయకులతో కలిసి కనిపించిన వారినల్లా భిక్ష అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకే సమ్మెపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. సమ్మెను విరమింపజేసే ప్రయత్నాలు ఇప్పటివరకు చేయకపోవడం విచారకరమన్నారు. పూజలు పురస్కారాలు చేస్తూ బాబాలకు స్వామీజీలకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేసే ముఖ్యమంత్రి కార్మికుల కష్టాలను తెలుసుకోవడం లేదని వాపోయారు.

'ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుపరం చేసేందుకే..'

ABOUT THE AUTHOR

...view details