తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​ - telangana varthalu

తెరాస, భాజపాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాల పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​
తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

By

Published : Feb 25, 2021, 6:50 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్​ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస, భాజపాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని ఉత్తమ్​ ఆరోపించారు. భద్రాద్రి అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న తెరాస ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అన్ని వర్గాల పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

జనరల్ స్థానంలో గిరిజనుడైన తనకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్​ అన్నారు. ప్రజా, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై మండలిలో గళమెత్తే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొదెం వీరయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఉత్తమ్ సమక్షంలోనే కాంగ్రెస్​ నాయకుల గొడవ

ABOUT THE AUTHOR

...view details