భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో రామయ్య వరాహావతారంలో భక్తులకు కనువిందు చేశారు. మేళతాళాలు, కోలాటాలతో తిరువీధుల్లో స్వామివారు ఊరేగారు. సీతాపతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాలుగో రోజు దశరథ తనయుడు నరసింహ అవతారంలో దర్శనమివ్వనున్నారు.
తిరువీధుల విహరించిన భద్రాద్రి రాముడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామయ్య సన్నిధిలో నేత్రపర్వంగా ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. మూడోరోజు వరాహావతారంలో కనువిందు చేసిన స్వామివారు.. రేపు నరసింహ అవతారంలో దర్శనమివ్వనున్నారు.
వైభవంగా రామయ్య తిరువీధి ఉత్సవాలు