తెలంగాణ

telangana

ETV Bharat / state

దొరికిపోయాడు.. దోపిడి మొత్తాన్ని రాబట్టారు

ఓ యువకుడు పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా పోలీసులకు దొరికిపోయాడు. అంతే గతంలో దోపిడి చేసిన మొత్తాన్ని పోలీసులు రాబట్టారు.

thief the amount of loot has been extracted yellandu police
దొరికిపోయాడు.. దోపిడి మొత్తాన్ని రాబట్టారు

By

Published : Jun 18, 2020, 7:49 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన తేజావత్ అనిల్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 2 లక్షల 22 వేల విలువైన నగదు, 73 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ పట్టణ జిల్లా ఎటపాకకు చెందిన తేజావత్ అనిల్ ప్రస్తుతం టేకులపల్లిలో ఉంటూ వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఈ తరుణంలో నిందితుడిని అరెస్టు చేశామని ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వేణు చందర్, ఎస్ఐ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఇంటర్​ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details