తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్యా.. తలంబ్రాలు సిద్ధమయ్యా.. - తలంబ్రాలు

వచ్చే నెల 2న శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణంలో అతి ముఖ్యమైన పవిత్రమైన తలంబ్రాలను చిత్రకూట మండపంలో సిద్ధం చేశారు. పసుపు కొమ్ములు దంచి.. తొలివిడతగా 20 క్వింటాళ్ల బియ్యాన్ని తలంబ్రాలుగా కలిపారు.

talambralu prepared for bhadradri ramayya's wedding in bhadrachalam
భద్రాద్రి రామయ్యా.. తలంబ్రాలు సిద్ధమయ్యా..

By

Published : Mar 10, 2020, 2:07 PM IST

జగమెరిగిన వేడుక భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం. ఈ జగత్కల్యాణానికి ఘడియలు సమీపిస్తున్నాయి. వచ్చే నెల 2న శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. పెళ్లి పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా సోమవారం సంప్రదాయబద్ధంగా ఆరంభించారు. వైష్ణవ సంప్రదాయం మేరకు చిత్రకూట మండపంలో స్థానాచార్యులు స్థలసాయి నేతృత్వంలో పసుపు కొమ్ములు దంచారు.

తర్వాత తొలి విడతగా 20 క్వింటాళ్ల నాణ్యమైన బియ్యాన్ని తలంబ్రాలుగా సిద్ధం చేశారు. ఇందులో తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం 60 కిలోల గులాలు, 60 కిలోల కుంకుమ, 30 కిలోల పసుపు, 10 లీటర్ల సెంటు, 10 లీటర్ల రోజ్‌ వాటర్‌, 30 లీటర్ల నూనె, 30 లీటర్ల నెయ్యి కలిపారు. అభిషేక మహోత్సవం వైభవంగా చేసి ఊయలలో ఉన్న స్వామికి డోలోత్సవం నిర్వహించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details