తెలంగాణ

telangana

ETV Bharat / state

'గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా'

తెలంగాణలో భాజపా క్రమంగా పుంజుకోవడం వల్ల తెరాస ఉనికి కోల్పోతూ వస్తోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఈనెల 31లోగా పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు.

'నన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి భద్రాచలం అభివృద్ధి చేస్తా'
'నన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి భద్రాచలం అభివృద్ధి చేస్తా'

By

Published : Dec 13, 2020, 11:48 AM IST

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉద్యమాలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి... రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి భద్రాచలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. సమావేశంలో భాజపా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, నాయకులు ఏనుగుల వెంకట్ రెడ్డి, ఎర్రం రాజు బెహరా, రామ్మోహన్ రావు నాగబాబు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఖమ్మం బల్దియా పోరుకు తెరాస కసరత్తు.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details