తెలంగాణ

telangana

ETV Bharat / state

badradri temple: 'కోటి గోటి తలంబ్రాల' వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు - koti goti thalambralu

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సమర్పించనున్న కోటి గోటి తలంబ్రాల వరి విత్తనాలకు రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ​లోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు విత్తనాలను ఆలయానికి తీసుకొచ్చి.. పూజలు జరిపించారు.

'కోటి గోటి తలంబ్రాల' వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు
'కోటి గోటి తలంబ్రాల' వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు

By

Published : Jul 4, 2021, 10:42 PM IST

పదకొండో కోటి గోటి తలంబ్రాల మహా యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణ అప్పారావు శ్రీకారం చుట్టారు. ఏటా ముందుగా వరి విత్తనాలకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం, కోరుకొండలో పంటలు పండించడం.. తద్వారా వచ్చిన వడ్లతో కోటి గోటి తలంబ్రాలను రాయయ్య కల్యాణానికి అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం కోరుకొండ నుంచి 15 కేజీల వరి విత్తనాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధికి తీసుకొచ్చారు. వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.

ఇదీ చూడండి: SABITHA: చెరువులు కబ్జా కాకుండా కాపాడుకుంటాం: సబితా ఇంద్రారెడ్డి

ABOUT THE AUTHOR

...view details