తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందులో సోలార్ ప్లాంట్​ ప్రారంభానికి సింగరేణి అధికారుల సన్నాహాలు - సోలార్​ పవర్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఆధ్వర్యంలో 39 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి పనులు కొనసాగుతుండగా ఈనెల 30నాటికి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 30నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి అవుతుందని జనరల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.

Solar project starts in Illandu
ఇల్లందులో సోలార్ విద్యుత్ ప్లాంట్​ ప్రారంభానికి.. సింగరేణి అధికారుల సన్నాహాలు

By

Published : Oct 25, 2020, 12:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఆధ్వర్యంలో 39 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ఉత్పత్తికి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి 15 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ఉత్పత్తికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 230 ఎకరాల విస్తీర్ణంలో 39 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ప్లాంట్​ నిర్మాణం కోసం రూ.170 కోట్ల వ్యయంతో పన్నులు కొనసాగుతుండగా ఈ ప్రాజెక్టు వల్ల ఇల్లందులో వాయు కాలుష్యం తగ్గి పర్యావరణం మెరుగవడమే గాక.. సింగరేణి సంస్థ స్వతహాగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కొంత ఆదాయాన్ని సృష్టించనుంది.


ప్రస్తుతం ఒక యూనిట్ ఉత్పత్తికి రూ. 6 ఖర్చవుతుండగా ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగు రూపాయలకే రానుందని దీనివలన ప్రతి యూనిట్​కి రెండు రూపాయల మేరకు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం 129 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యానికి గాను ఇప్పటికే మణుగూరులో 30, రామగుండంలో 50, సత్తుపల్లిలో 10 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు రూపొందగా ఇల్లందులో కూడా 39 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తిస్థాయిలో పూర్తి కావాల్సి ఉండగా కొవిడ్ ప్రభావం కారణంగా జాప్యమయ్యాయి.

ఇదీ చదవండి-రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details