భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. కోయగూడెం ఉపరితల బొగ్గు గనులకు వెళ్తున్న కార్మికులను విధులకు వెళ్లొద్దని కోరుతున్న కార్మిక సంఘాల జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మూడోరోజు సమ్మె... సింగరేణి జేఏసీ నాయకుల అరెస్ట్ - coal mines
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చేపట్టిన సమ్మె మూడోరోజూ కొనసాగుతోంది. ఇల్లందులో కార్మికులను విధులకు వెళ్లొద్దని కోరుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇల్లందులో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల అరెస్ట్
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. అరెస్టయిన వారిలో ఐకాస నాయకులు కె. సారయ్య, ఏపూరి బ్రహ్మం, దేవరకొండ శంకర్, గోచకొండ సత్యనారాయణ, తాళ్లూరి కృష్ణ, మందా లక్ష్మినారాయణ, సైదులు, ఆరుట్ల మాధవరెడ్డి, నాయకులు బంధం నాగయ్య, నజీర్ అహ్మద్, దాసరి రాజారాం, గుగులోత్ కృష్ణ, వడ్ల శ్రీను ఉన్నారు.
ఇవీ చూడండి: ఆదివాసీల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలి: కోదండరాం