తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి' - కరోనా వైరస్​ వార్తలు

ఇల్లందు ఏరియాలోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల క్యాంపు కార్యాలయాన్ని ఏరియా జీఎం సత్యనారాయణ తనిఖీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

singareni gm inspected corona precautions in yellandhu area
'కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి'

By

Published : Aug 12, 2020, 4:06 PM IST

సింగరేణి ప్రాంతాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల క్యాంప్ కార్యాలయాన్ని ఏరియా జీఎం సత్యనారాయణ తనిఖీ చేశారు. కార్మికుల హాజరు నమోదు కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన శానిటైజేషన్​, థర్మల్​ స్క్రీనింగ్​ను ఆయన పరిశీలించారు.
క్యాంటీన్​లోని భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. కార్మికులందరూ భౌతిక దూరం పాటించాలని.. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు మాస్కులను ధరించి విధులకు హాజరుకావాలని తెలిపారు. సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details