తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి సరికొత్త రికార్డు.. 24 గంటల్లోనే.. - latest record coal producing at SCCL

Singareni Company is a new record in coal production: సింగరేణి సంస్థకు మరో రికార్డు దక్కింది. కేవలం 24 గంటల్లోనే 2,46,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది, దాంతో పాటు 2,53,000 టన్నులు రవాణా చేసి రికార్డు సృష్టించిందని సీఎండీ చెప్పారు. విద్యుదేతర సంస్థలకు బొగ్గు విక్రయానికి సంబంధించి జనవరి 17 నుంచి ఈ-వేలం నిర్వహించనున్నట్లు సింగరేణి మార్కెటింగ్‌ విభాగం జీఎం కె.సూర్యనారాయణ తెలిపారు.

Singareni organization is a new record
సింగరేణి సంస్థ సరికొత్త రికార్డు

By

Published : Dec 30, 2022, 9:38 AM IST

Singareni Company is a new record in coal production: సింగరేణి సంస్థ ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నెల 28న ఉదయం షిఫ్టు నుంచి రాత్రి షిప్టు పూర్తయ్యే వరకు 24 గంటల వ్యవధిలో 2.46 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి, 2.53 లక్షల టన్నులు రవాణా చేసినట్లు సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది కొత్త రికార్డు. ఈ నెల 20న నమోదైన రికార్డు(2.24 లక్షల టన్నుల ఉత్పత్తి, 2.35 లక్షల టన్నుల రవాణా)ను కార్మికులు తిరగరాశారు. బొగ్గు రవాణా కోసం 28న ఒక్కరోజే దక్షిణ మధ్య రైల్వే సహకారంతో గరిష్ఠంగా 44 సరకు రవాణా రైళ్లను వినియోగించాం.

28న సాధించిన రవాణా రికార్డులో మణుగూరు ఏరియా 64 వేల టన్నులు అందించి తొలిస్థానంలో, కొత్తగూడెం ఏరియా 51 వేల టన్నులతో రెండో స్థానంలో నిలిచింది’ అని సీఎండీ వెల్లడించారు. అందుకు కృషిచేసిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఏడాదికి నిర్ణయించిన 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సమష్ఠిగా కృషిచేయాలన్నారు. ఈ ఏడాదికి ఇప్పటివరకు 2,591 రైళ్ల ద్వారా 465 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి వినియోగదారులకు అందించిందని వివరించారు.

బొగ్గు విక్రయానికి 17 నుంచి ఈ-వేలం: విద్యుదేతర సంస్థలకు బొగ్గు విక్రయానికి సంబంధించి జనవరి 17 నుంచి ఈ-వేలం నిర్వహించనున్నట్లు సింగరేణి మార్కెటింగ్‌ విభాగం జీఎం కె.సూర్యనారాయణ తెలిపారు. గురువారమిక్కడ సింగరేణి భవన్‌లో నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశానికి తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెందిన సిమెంటు, స్పాంజ్‌ ఐరన్‌, క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్లు తదితర పరిశ్రమల నుంచి 140 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నిబంధనల మేరకు 2016-17 నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు ఈ-వేలం నిర్వహించామని, 8వ వేలంలో బిడ్లు దక్కించుకున్న వినియోగదారులు నాలుగేళ్లపాటు కోరుకున్న గ్రేడ్‌ బొగ్గును, కోరుకున్న గని నుంచి పొందే అవకాశం ఉందని వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details