భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న చెరువులపై కబ్జాదారుల కన్నుపడుతోంది. సంబంధిత అధికారులు చోద్యం చూస్తుండడంతో క్రమంగా చెరువులు మాయమైపోతున్నాయి. ఇల్లెందు సమీపంలోని 118 ఎకరాలు గల ఇల్లెందులపాడు చెరువు 20 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. ఖమ్మం నగరంలోని శ్రీనగర్‌కాలనీకి వెనుకాల అబ్బుకుంట చెరువు మాయమైంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లేకుండా చేశారు. వైరా మండలం అష్ణగుర్తి సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు మాయమైంది. అశ్వారావుపేట మండలం పేటమాలపల్లి సమీపంలోని తురక ఎర్రకుంట చెరువు ఆనవాళ్లు లేకుండాపోయింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా బయటకు రాని ఆక్రమణ చెరువుల జాబితా ఎంతో ఉంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించకుంటే మాయమయ్యే చెరువుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది.
భద్రాద్రి జిల్లాలో దర్జాగా చెరువుల కబ్జా..! - ponda
ఖాళీగా ఉన్న స్థలాలనే కాదు చెరువులను సైతం వదలడం లేదు కబ్జాదారులు. ఆయా ప్రాంతాల్లో భూములు విలువైనవి కావడంతో అక్రమార్కులు యథేచ్ఛగా వీటిని చేజిక్కించుకొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే, మరిన్ని చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
దర్జాగా చెరువుల కబ్జా.....!