భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు వామపక్షాలు, గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. పోడు భూములకు రక్షణ కల్పించాలని, గిరిజనులపై అటవీశాఖ, పోలీస్ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. ఆదివాసీ హక్కులను కాలరాసే అటవీ చట్ట సవరణలు ఆపాలని ఐటీడీఏ పీవో గౌతమ్ కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పోడు భూముల రక్షణకు గిరిజనుల ఆందోళన - podu farmers
పోడు భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాలు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాయి.
పోడు భూములు రక్షణకు గిరిజనుల ఆందోళన