భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూలమాలవేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయాల్లో రాజకీయాల నుంచి విముక్తి లభించాలి: పరిపూర్ణానంద స్వామి - అయోధ్య
భద్రాచలం సీతారామచంద్ర స్వామిని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి దర్శించుకన్నారు. దేశంలోని ఆలయాలను రాజకీయం చేయొద్దని రామున్ని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఆలయాలన్నీ రాజకీయాలు కావొద్దు: పరిపూర్ణానంద స్వామి
అయోధ్యలో త్వరగా రామమందిర నిర్మాణంతో ప్రతిష్ఠ జరగాలని కోరుకున్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. దేశంలోని ఆలయాలన్నీ రాజకీయం కాకుండా హిందూ సాంప్రదాయాలు వెళ్లివిరిస్తూ ప్రత్యేకతను సంతరించుకోవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు