తెలంగాణ

telangana

ETV Bharat / state

మణుగూరులో నీట మునిగిన ఇళ్లు.. ఇబ్బందుల్లో ప్రజలు - ఇబ్బందుల్లో ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ఇళ్లు నీట మునిగాయి. వరుసగా కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పురపాలక కమిషనర్​, తహసీల్దార్​ పర్యటించారు.

మణుగూరులో నీట మునిగిన ఇళ్లు

By

Published : Aug 8, 2019, 6:44 PM IST

మణుగూరులో నీట మునిగిన ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి పలు ఇళ్లు నీటమునిగాయి. పట్టణంలోని సుందరయ్య నగర్, గాంధీనగర్, ఇందిరానగర్, ఆదర్శనగర్, సమితి సింగారం కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కట్టు వాగు, మెట్ల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో పురపాలక కమిషనర్ వెంకటస్వామి, తహసీల్దార్ మంగీలాల్ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details