భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలు దుకాణాలు లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా దుకాణాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలో లాక్డౌన్, కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా దుకాణాలు కొనసాగిస్తున్న పాన్‌షాప్, ఎలక్ట్రికల్, బట్టల దుకాణాలపై పురపాలక సంఘం అధికారులు జరిమానా విధించారు. ఒక్కో దుకాణానికి రూ.8వేల చొప్పున కమిషనర్ శ్రీనివాసరెడ్డి జరిమానా వేశారు. నిబంధనలు పాటించకుంటే.. దుకాణాల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానా - నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు పాటించని దుకాణాదారులపై అధికారులు జరిమానా విధించారు.

నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానా