వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మొదటి రోజు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి మత్య్సావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకొచ్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానివేదన అనంతరం మత్స్యావతారంలో ఉన్న స్వామివారు చిత్రకూట మండపం వద్ద దర్శనమిచ్చారు.
మత్స్యావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య - భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల వార్తలు
భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పూర్వకాలంలో సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను సముద్రంలో పారేయడం వల్ల విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయని అర్చకులు వివరించారు. కరోనా కారణంగా తిరువీధి సేవలను, ప్రసాద వితరణలను రద్దు చేశారు. ఉత్సవాల్లో రెండో రోజైన బుధవారం స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మత్స్యావతారంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం వల్ల కేతు గ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ వేదపండితులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన అగ్రిగోల్డ్ ఆస్తులకు హైకోర్టు ఆమోదం