తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం

కుమారుడికి అంత్యక్రియలు చేయలేని దుస్థితిలో... బిడ్డ మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిన తల్లి దయనీయ పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రచురించిన కథనంపై పులువురు స్పందించారు. భద్రాచలంలోని మదర్​ థెరిసా చారిటబుల్​ ట్రస్ట్​ బాధిత కుంటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

mother teresa trust respond on etv bharat story
కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం

By

Published : May 15, 2020, 12:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పేద కుటుంబం దయనీయ స్థితిపై ఈటీవీ భారత్, ఈటీవీ​లో ప్రచురితమైన కథనంపై పలువురు స్పందించారు. లాక్‌డౌన్‌ కారణంగా చేతిలో చిల్లిగవ్వ లేని ఓ తల్లి... అనారోగ్యంతో చనిపోయిన కుమారుడి మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్లింది. దహనసంస్కారాలు చేసే స్థామత లేక గోదారి ఒడ్డున ఇసుకలో పూడ్చిపెట్టింది.

తల్లి దీన స్థితిపై ఈటీవీ భారత్​లో​ "ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు"పేరుతో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు. తాజాగా... మదర్‌ థెరిసా ట్రస్టు స్పందించి బాధిత కుటుంబానికి నిత్యావసర సరకులు, ఇతర సామగ్రి, నగదు అందజేసి వారికి అండగా నిలిచింది.

ఇదీ చూడండి:ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details