ఇల్లెందులో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని తామంతా ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇల్లందు పురపాలక సంఘం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకవర్గంతో కలిసి కేక్ కట్ చేశారు.
కేటీఆర్ సీఎం అవుతారన్న శుభవార్త త్వరలోనే వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ పాలనలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.